దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం
దేశంలోని ఆరు నగరాల్లో జరిగే ఈ టోర్నీని కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
టోర్నీ నిర్వహణలో భాగంగా... మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది.
జట్ల వివరాలు-వేదికలు
ఎలైట్ గ్రూప్ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర.
వేదిక: బెంగళూరు
ఎలైట్ గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం.
వేదిక: కోల్‌కతా
ఎలైట్ గ్రూప్ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్.
వేదిక: వడోదర
ఎలైట్ గ్రూప్ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్
ఎలైట్ గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై
ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్.
వేదిక: చెన్నై