Skip to main content

దేశంలోని ఎన్ని చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?

కేంద్ర పెట్రోలియం శాఖ రూ. 3,874 కోట్లతో తక్కువ ధరల వద్ద చమురును కొనుగోలు చేసి దేశంలోని మూడు ప్రాంతాల్లో ఉన్న భూగర్భ చమురు కేంద్రాల్లో నిల్వ చేయగా.. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అక్టోబర్ 14న ఇందుకు ఆమోదం తెలియజేసింది.
Current Affairs
ఇలా నిల్వ చేసిన చమురుకు సంబంధించి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

మూడు ప్రాంతాలు...
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కనిష్టాలకు చేరిన సమయంలో కొనుగోలు చేసి, నిల్వ చేసుకునేందుకు గాను కేంద్రం మూడు భూగర్భ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్టు(ఓఐడీబీ)కి చెందిన ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌స్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్‌ఎల్) ఈ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ మూడు కేంద్రాలే కాకుండా ఒడిశాలోని చాందీకోల్‌లో నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యంతో మరో చమురు నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.


మూడు చమురు నిల్వ కేంద్రాలు
 

సంఖ్య

నిల్వకేంద్రం, ప్రాంతం

నిల్వ సామర్థ్యం

1

విశాఖపట్నం, ఏపీ

1.3 మిలియన్ టన్నులు

2

మంగళూరు, కర్ణాటక

1.5 మిలియన్ టన్నులు

3

పాడూర్, కర్ణాటక

2.5 మిలియన్ టన్నులు

Published date : 16 Oct 2020 12:20PM

Photo Stories