Skip to main content

దేశంలోనే తొలి ఇండస్ట్రియల్‌–4 సీవోఈ ఏ రాష్ట్రంలో ఏర్పాటవుతోంది?

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దేశంలోనే తొలి ఇండస్ట్రియల్‌–4 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటవుతోంది.
Current Affairs అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ).. ఈ సీవోఈని ఏర్పాటు చేస్తోంది.

ఎస్‌టీపీఐ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి 12 సీవోఈలను ఏర్పాటు చేస్తున్నట్లు జూన్‌ 13న ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ తెలిపారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఇండస్ట్రీస్‌–4 సీవోఈ విశాఖలో ఏర్పాటవుతోంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి ఇండస్ట్రియల్‌–4 సీవోఈ ఏ రాష్ట్రంలో ఏర్పాటవుతోంది?
ఎప్పుడు : జూన్‌ 13
ఎవరు : సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)
ఎక్కడ : విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)
ఎందుకు : అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు పెంచడానికి...
Published date : 15 Jun 2021 08:04PM

Photo Stories