Skip to main content

దేశంలోనే అత్యుత్తమ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌

దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మొదటి స్థానంలో నిలిచారు.
Current Affairs

యోగి తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 2020 జూలైలో చేసిన ఈ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24 శాతం, కేజ్రీవాల్‌కు 15 శాతం, వైఎస్‌ జగన్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్‌ ఉండగా... తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు.


సొంత రాష్ట్రంలో వైఎస్‌ జగన్...

సొంత రాష్ట్రంలో 87 శాతం ప్రజల మద్దతుతో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా నంబర్‌ వన్‌ స్థానంలో వైఎస్‌ జగన్‌ నిలిచారు. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 63 శాతం, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి 59 శాతం ప్రజల మద్దతు లభించింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు 55 శాతం ప్రజల ఆదరణ లభించగా.. యోగి ఆదిత్యనాథ్‌కు ఉత్తరప్రదేశ్‌లో 49 శాతం ప్రజాదరణ దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
ఎక్కడ :దేశంలో
Published date : 11 Aug 2020 05:57PM

Photo Stories