దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
Sakshi Education
దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై నిలిచింది. ఆసియాలో తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకోగా, ప్రపంచంలో 67వ ర్యాంకు సాధించింది.
ఈ మేరకు గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఈసారి కూడా హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచింది. హాంకాంగ్ తర్వాత స్థానాల్లో టోక్యో (2), సింగపూర్ (3), సియోల్ (4), జ్యూరిక్ (5), షాంఘై (6), అస్గాబత్ (7), బీజింగ్ (8), న్యూయార్క్ సిటీ (9), షెంజెన్ (10) ఉన్నాయి. తక్కువ ఖరీదైన నగరాల్లో టునిస్ (209), తాష్కెంట్ (208), కరాచీ (207) ఉన్నాయి.
మెర్సెర్ నివేదికలోని అంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్
మెర్సెర్ నివేదికలోని అంశాలు
- ప్రపంచవ్యాప్తంగా 209 నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
- ముంబైలో బయట తిండి ధరలు, యుటిలిటీస్ క్షీణతను నమోదుచేసినప్పటికీ.. నివాస గృహాల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
- ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారికి ముంబై అత్యంత ఖరీదైనది.
- జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్)పై 209 నగరాల్లో సర్వే నిర్వహించగా.. ముంబై 67వ స్థానంలో ఉంది.
- కాస్ట్ లీవింగ్ పరంగా న్యూఢిల్లీ 118వ స్థానంలో ఉంది. చెన్నై (154), బెంగళూరు (179), కోల్‌కతా (189) స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్
Published date : 29 Jun 2019 06:18PM