Skip to main content

దేశంలో తొలిసారిగా ‘జెండర్’ బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రాష్ట్రం?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళలకు, బాలికలకు అండగా నిలిచే పలు కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి ప్రసంగించారు.
Edu news

అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. సైబర్‌ కియోస్క్‌లను ఆవిష్కరించడంతో పాటు 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్, 900 దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను సీఎం ప్రారంభించారు. బాలికలకు ఉచిత న్యాప్‌కిన్స్‌ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

తొలిసారిగా జెండర్‌ బడ్జెట్‌...
కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తూ... మహిళల కోసం 2021 ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా బడ్జెట్‌ కాన్సెప్ట్‌ తెస్తున్నామని, అక్కచెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో అందులో తెలియచేస్తామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ‘జెండర్‌’ బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నామన్నారు.

Published date : 09 Mar 2021 07:15PM

Photo Stories