దేశంలో తొలి ఆర్బిట్రేషన్ సెంటర్ ఏ నగరంలో ఏర్పాటు కానుంది?
Sakshi Education
అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్) మధ్యవర్తిత్వ కేంద్రం(ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్) హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది.
దేశంలో ఏర్పాటు అవుతున్న తొలి ఆర్బిట్రేషన్ సెంటర్ ఇదే. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 20న... హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది.
ట్రస్ట్‌డీడ్ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... ‘‘1996లో ఆర్టిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. 1926లో పారిస్‌లో మొదటి ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభమైంది. ఇటీవల దుబాయ్‌లో కూడా ఓ కేంద్రం ప్రారంభమైంది’’ అని పేర్కొన్నారు. ట్రస్ట్‌డీడ్‌పై జస్టిస్ రమణ, ట్రస్ట్ లైఫ్ మెంబర్లు జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు, జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లి, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : భారత న్యాయమూర్తులు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం...

Published date : 21 Aug 2021 05:58PM