దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో
Sakshi Education
హైదరాబాద్‌లో మరో మెట్రోరైలు మార్గం ప్రారంభమైంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మించిన 11 కి.మీ. మెట్రోరైలు మార్గానికి జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7న పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రోరైల్ నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో అవతరించింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొత్తానికి జేబీఎస్ స్టేషన్ మాత్రమే ఐదు అంతస్తుల్లో నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్కగా అవతరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హైదరాబాద్ మెట్రో
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్కగా అవతరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హైదరాబాద్ మెట్రో
ఎక్కడ : దేశంలో
Published date : 08 Feb 2020 06:06PM