దేశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు?
Sakshi Education
దేశంలోని తొలి ‘రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్)’ రైలు నమూనాను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ విడుదల చేసింది.
ఢిల్లీలోని ప్రఖ్యాత లోటస్ టెంపుల్ డిజైన్‌లో దీని ఇంజన్‌భాగం తయారుచేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో గంటకు 180 కిలో మీటర్ల గరిష్టవేగంతో ఈ రైలు దూసుకుపోనుంది. భారత్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు కానుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందే ఈ రైళ్లు పర్యావరణానికి అనుకూలమైనవి. 2022 నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) రైలు నమూనా విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) రైలు నమూనా విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ
Published date : 26 Sep 2020 05:18PM