Skip to main content

దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌

దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్‌ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్‌ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు.
Current Affairs అలాగే పేదలకు ఉచిత రేషన్‌ అందించే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకాన్ని 2021, నవంబర్‌ వరకు పొడగిస్తున్నామని వెల్లడించారు. దేశ ప్రజలనుద్దేశించి జూన్ 7న ప్రసంగించిన మోదీ... ఈ మేరకు ప్రకటించారు.

మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు...
  • జూన్‌ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం.
  • ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది.
  • రాష్ట్రాల వాటా అయిన 25 శాతం టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
  • రాష్ట్రాల వాటా అయిన 25 శాతం సహా మొత్తం 75 శాతం టీకాలను కేంద్రమే టీకా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుంది. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. మిగతా 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చు.
  • వ్యాక్సిన్‌ నిర్ధారిత ధరపై ఆసుపత్రులు విధించే సర్వీస్‌ చార్జ్‌ ఒక్కో డోసుకు, రూ. 150కి మించకూడదు.
  • దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మరో మూడు టీకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి.
  • కరోనా మూడో వేవ్‌ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. పిల్లల కోసం రెండు వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.
  • ముక్కు ద్వారా స్ప్రే చేసే టీకాను అభివృద్ధి చేసే పరిశోధనలు త్వరితగతిన జరుగుతున్నాయి.
  • ఇప్పటికే దేశవ్యాప్తంగా అర్హులైనవారికి 23 కోట్ల టీకా డోసులు వేశాం.
Published date : 08 Jun 2021 06:48PM

Photo Stories