Skip to main content

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు జనవరి 24న ముగిసింది.
Current Affairsఈ సదస్సులో ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు.అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు.

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు థీమ్ : Stakeholders for a Cohesive and Sustainable World (సమైక్య మరియు సుస్థిర ప్రపంచానికి వాటాదారులు)

మందగమనం తాత్కాలికమే: ఐఎంఎఫ్
సదస్సు ముగింపు కార్యక్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అన్నారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

గోయల్ కీలక భేటీలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా జనవరి 24న పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
Published date : 25 Jan 2020 05:43PM

Photo Stories