Skip to main content

డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది.
Current Affairs

డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.


చైనాలో
2.32 లక్షల కేసులు
చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్‌ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

5
జీ వల్ల కరోనా సోకదు
కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి కొట్టి పారేసింది. మొబైల్‌ ప్రపంచంలో 5జీ హైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ టెక్నాలజీ ఓ విప్లవం లాంటిది. అయితే ఈ 5జీ టెక్నాలజీ కరోనా వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధికార ప్రతినిధి మోనికా గెనెర్‌ స్పష్టం చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డబ్ల్యూహెచ్‌వోకు అదనపు గ్రాంట్‌
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : చైనా
Published date : 24 Apr 2020 07:14PM

Photo Stories