డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
Sakshi Education
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ (డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది.
ఈ మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో రెండింటితో జట్టు కట్టింది.
ఫిబ్రవరిలో తొలిసారిగా...
డబ్ల్యూఎల్‌పీ 2021 ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోతో చేతులు కలిపింది. డబ్ల్యూఎల్‌పీకి దేశీయంగా ముంబై తొలి హబ్ కాగా, హైదరాబాద్ రెండోది కానుంది.
10కి పైగా దేశాలు...
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ గ్రూప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా తదితర 10 పైగా దేశాలు ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్ భాస్కరన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : హైదరాబాద్
ఎక్కడ : భారత్
ఎందుకు : వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు

Published date : 02 Apr 2021 06:41PM