డార్ట్‌మండ్ క్లబ్‌తో హైదరాబాద్ ఎఫ్‌సీ ఒప్పందం
Sakshi Education
జర్మనీ ఫుట్‌బాల్ లీగ్ ‘బుండెస్‌లీగ’ జట్టు బొరుసియాడార్ట్‌ముండ్‌తో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) రెండేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని హైదరాబాద్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆగస్టు 20న వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం తమ జట్టుతో పాటు ఇక్కడి యువ ప్లేయర్లను మేటి ఆటగాళ్లుగా తయారు చేయడంలో హైదరాబాద్ ఎఫ్‌సీకిబొరుసియా సహాయపడుతుంది. డార్ట్‌ముండ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఫుట్‌బాల్ లీగ్ జట్లతో ఇటువంటి ఒప్పందాలను కలిగి ఉంది. థాయ్ ప్రీమియర్ లీగ్ జట్టు బురిరమ్ యునైటెడ్‌తో, ఆస్ట్రేలియాకు చెందిన ఎన్పీఎల్ జట్టు మార్కోని ఎఫ్‌సీతో, జపాన్ కు చెందిన ఐవాటెగ్రుల్లామోరియోకతోబొరుసియా ఒప్పందాలను కలిగి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ ఫుట్‌బాల్ లీగ్ ‘బుండెస్‌లీగ’ జట్టు బొరుసియాడార్ట్‌ముండ్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)
ఎందుకు :యువ ప్లేయర్లను మేటి ఆటగాళ్లుగా తయారు చేయడంలో హైదరాబాద్ ఎఫ్‌సీకిబొరుసియా సహాయపడుతుంది

Published date : 25 Aug 2020 11:18AM