Skip to main content

దానశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన పారిశ్రామిక వేత్త?

2019-20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు.
Current Affairs

ఈ నివేదిక ప్రకారం... ప్రేమ్‌జీ రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు.

2019-20 దానశీలుర జాబితా-ముఖ్యాంశాలు

  • జాబితాలో ప్రేమ్‌జీ తర్వాత రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ నాడార్ రెండో స్థానంలో నిలిచారు.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగింది.
  • రూ. 10 కోట్లకు మించి దానమిచ్చిన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది.
  • విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు ఉన్నాయి.
  • రూ. 5 కోట్లకు పైగా విరాళమిచ్చిన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్ నీలేకని సతీమణి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2019-20 దానశీలుర జాబితాలోవిప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్
ఎక్కడ : భారత్
Published date : 11 Nov 2020 05:39PM

Photo Stories