డాన్ కొలోవ్ రెజ్లింగ్ టోర్నిలో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
డాన్ కొలోవ్-నికోలా పెట్రోవ్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
బల్గేరియాలో జరిగిన ఈ టోర్నిలో భారత రెజ్లర్స్ పూజా ధండా, బజరంగ్ పూనియా పసిడి పతకాలను సాధించారు. మార్చి 2న జరిగిన మహిళల 59 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్‌లు జరగ్గా... పూజా మూడు బౌట్‌లలోనూ విజయం సాధించింది. మార్చి 3న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12-3 పాయింట్ల తేడాతో జోర్డాన్ మైకేల్ ఒలివర్ (అమెరికా)పై ఘనవిజయం సాధించాడు.
ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. బజరంగ్‌తోపాటు పూజా ధండా (మహిళల 59 కేజీలు) స్వర్ణం నెగ్గగా... వినేశ్ (53 కేజీలు), సరిత మోర్ (59 కేజీలు), సాక్షి మలిక్ (65 కేజీలు), సందీప్ తోమర్ (పురుషుల 61 కేజీలు) రజత పతకాలు గెలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాన్ కొలోవ్ రెజ్లింగ్ టోర్నిలో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : మార్చి 2, 3
ఎవరు : పూజా ధండా, బజరంగ్ పూనియా
ఎక్కడ : బల్గేరియా

Published date : 04 Mar 2019 06:12PM