Skip to main content

ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ చట్టంఉద్దేశం?

దేశ రాజధాని న్యూఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఇన్‌చార్జ్‌గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
Current Affairs
తాజా నోటిఫికేషన్‌తో చట్టంలోని నిబంధనలు ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందనిహోంమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్‌జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. ‘‘ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు-2021(జీఎన్‌సీటీడీ– 2021)’’గాఈ పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు...
ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్‌ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి.ఎల్‌జీని కేంద్రం నియమిస్తునందున,ఇకపై దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి జీఎన్‌సీటీడీ– 2021
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు :ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని...
Published date : 29 Apr 2021 06:09PM

Photo Stories