Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 9th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 9th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 9th 2022
Current Affairs in Telugu September 9th 2022

UNDP Rankings: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి... భారత్‌  స్థానం ఎంతంటే?

 

కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్‌డీపీ చీఫ్‌ అచిమ్‌ స్టెనియర్‌ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి. 

Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

కోవిడ్‌–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్‌ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు.  పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్‌ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు.  

Also read: Times of India Awards : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు.. దేశంలోనే అత్యుత్తమ..

132వ స్థానంలో భారత్‌ 
2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్‌ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్‌ 131 ఉండేది.  ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్‌డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 8th కరెంట్‌ అఫైర్స్‌

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

 

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం, 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్‌–2(96) ఇకలేరు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో ఉన్న రాణి సెప్టెంబర్ 8 న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. 

Also read: Rakesh Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ ఝున్‌ వాలా హఠాన్మరణం

1952లో 25 ఏళ్లకే బ్రిటన్‌ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్‌ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు.  

ఎలిజబెత్‌–2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు.  

 Also read: Fidel Valdez Ramos: ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామోస్‌ కన్నుమూత
 
ఇక బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 
బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్‌–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్‌–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్‌ 2న పట్టాభిషక్తురాలయ్యారు.  

  • రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్‌ కౌన్సిల్‌ లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది.  
  • కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం చేస్తారు.  
  • ప్రైవీ కౌన్సిల్‌ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.   
  • కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు.  
  • పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్‌ చార్లెస్‌ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం           చేయాలి.    

Also read: మాజీ అంపైర్ Rudi Koertzen దుర్మరణం

సుదీర్ఘ కాలం రాణిగా.. 
ఎలిజబెత్‌–2.. పూర్తిపేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ. 1926 ఏప్రిల్‌ 21న ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌లో కింగ్‌ జార్జి–6, క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులకు తొలి సంతానంగా జని్మంచారు. తల్లి ప్రోత్సాహంతో ఇంట్లోనే విద్యనభ్యసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంలోమహిళల విభాగంలో పనిచేశారు. 1947 నవంబర్‌ 20న గ్రీస్‌ అండ్‌ డెన్మార్క్‌ రాజకుమారుడు, దూరపు బంధువు అయిన ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం.. ప్రిన్స్‌ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ జన్మించారు. ఎలిజబెత్‌–2 మహారాణి భర్త ఫిలిప్‌ 2021 ఏప్రిల్‌ 9న కన్నుమూశారు. ఆమె తండ్రి కింగ్‌జార్జి–6 1952లో మరణించారు. మగ వారసులు లేకపోవడంతో బ్రిటిష్‌ రాజకుటుంబ సంప్రదాయ ప్రకారం 1952 ఫిబ్రవరి 6న 25 ఏళ్ల వయసున్న ఎలిజబెత్‌–2 తదుపరి రాణిగా ఎంపికయ్యారు. అయితే, ఆ సమయంలో ఆమె కెన్యాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఏడాది తర్వాత.. 1953 జూన్‌ 2న క్వీన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పట్టాభిషేకానికి ప్రపంచదేశాల అధినేతలు హాజరయ్యారు. ఎలిజబెత్‌ ఏడు స్వతంత్ర కామన్‌వెల్త్‌ దేశాలకు.. యూకే, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, సీలోన్‌(శ్రీలంక)కు రాణిగా మారారు. 1977లో రజతోత్సవాలు, 2002లో స్వరో్ణత్సవాలు, 2012లో వజ్రోత్సవాలు, 2022లో ప్లాటినం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 2022 సెప్టెంబర్‌ 8వ తేదీ దాకా నిరాటంకంగా పదవిలో కొనసాగారు.  బ్రిటిష్‌ చరిత్రలో సుదీర్ఘ కాలం (63 సంవత్సరాల 7 నెలల 2 రోజులు) రాణిగా కొనసాగినట్లు క్వీన్‌ విక్టోరియా పేరిట ఉన్న రికార్డును 2015 సెపె్టంబర్‌ 9న క్వీన్‌ ఎలిజబెత్‌ అధిగమించారు. అత్యధిక కాలం జీవించిన, అత్యధిక కాలం పదవిలో కొనసాగిన బ్రిటిష్‌ మోనార్క్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రెండో రాజు/రాణిగా రికార్డు నెలకొల్పారు.  

Also read: Former Japan PM: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

కీలక పరిణామాలకు మౌనసాక్షి  
70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్‌–2 రాణి ప్రపంచంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్‌ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్‌ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్‌ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్‌ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనా్రస్తాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్‌ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్‌–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు.  

Also read: Dr V Krishnamurthy: పబ్లిక్‌ రంగ పితామహుడు కృష్ణమూర్తి కన్నుమూత

క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు.       – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Netaji Statue:నేతాజీ మార్గంలో నూతన శిఖరాలకు.. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ

 

ఆధునీకరించిన ఇండియా గేట్‌ ప్రాంతంలో 28 అడుగుల ఎత్తయిన, 65 టన్నుల బరువైన నేతాజీ ఏకశిలా గ్రానైట్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్ 8 న  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘నేతాజీ చూపిన మార్గంలో భారత్‌ ముందుకు సాగి ఉంటే ఈరోజు దేశం మరింత అత్యన్నత స్థాయిలో ఉండేది. కానీ, భారత్‌ ఆ సువర్ణావకాశాన్ని కోల్పోయింది. దురదృష్టవశాత్తు ఆయనకు మన స్మృతిపథంలో సరైన స్థానం దక్కలేదు. ఆయన నిలువెత్తు విగ్రహం నేడు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకం. 

Also read: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?

ఢిల్లీకి 1,665 కి.మీ.ల దూరంలోని ఖమ్మం నుంచి 100 అడుగుల పొడవైన, 140 చక్రాల ట్రక్కు మీద ఏకశిలను తెచ్చారు. 280 మెట్రిక్‌ టన్నుల శిలను చెక్కి 26 వేల పని గంటలు శ్రమించి 65 టన్నుల శిల్పానికి తుదిరూపునిచ్చారు. అరుణ్‌ యోగిరాజ్‌ నేతృత్వంలోని శిల్పుల బృందం ఈ పనిపూర్తిచేసింది. ఇండియాగేట్‌ క్రిందిభాగంలో గతంలో బ్రిటిష్‌ రాజు కింగ్‌ జార్జ్‌–5 విగ్రహం ఉన్న చోటనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. బ్రిటిష్‌ రాజరిక గుర్తుల తొలగింపులో భాగంగా 1968లో జార్జ్‌ విగ్రహాన్ని తొలగించారు. రూ.13,450 కోట్లతో చేపట్టిన సెంట్రల్‌ విస్టా అవెన్యూ ప్రాజెక్టులో భాగంగానే నేతాజీ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు.

Also read:  Quiz of The Day (September 08, 2022): భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?

ఆకట్టుకునేలా కర్తవ్య పథ్‌
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు విస్తరించిన, కొత్త సొబగులు అద్దుకున్న ‘కర్తవ్య పథ్‌’ను ప్రధాని మోదీ సెప్టెంబర్ 8 న ప్రారంభించారు. ప్రఖ్యాత పర్యాటక స్థలంగా పేరొందిన రాజ్‌పథ్‌ను సర్వాంగ సుందరంగా ఆధునీకరించి కర్తవ్య పథ్‌గా నామకరణం చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్‌ వలసపాలన, బానిసత్వపు గుర్తులను చెరిపేస్తూ రాజ్‌పథ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మార్చాం’ అని అన్నారు. కర్తవ్యపథ్‌ సుందరీకరణ, నిర్మాణ పనుల్లో భాగస్వాములైన కార్మికులతో ముచ్చటించారు. 

Also read: CEO of NITI Aayog: నీతి ఆయోగ్‌ సీఈవోగా పరమేశ్వరన్‌

కర్తవ్య పథ్‌ విశేషాలు

  • 15.5 కి.మీ.ల పొడవునా ఎర్ర గ్రానైట్‌ రాళ్లు పొదిగిన పాదచారి బాటలు, అండర్‌పాస్‌లు, ఎటుచూసినా పచ్చదనం కన్పించేలా చెట్లు, మెరుగైన పార్కింగ్, కొత్త దుకాణ సముదాయాలు, ఎగ్జిబిషన్‌ స్టాళ్లు, కనువిందు చేసే నైట్‌ లైటింగ్‌ ఏర్పాటుచేశారు.
  • మరమ్మతు చేసిన కాల్వలు, ఘన వ్యర్థ్యాల సమర్థ నిర్వహణ, వాడుక నీటి రీసైక్లింగ్, వాన నీటి సంరక్షణ, తక్కువ విద్యుత్‌తో వెలిగే లైట్లు
  • ఒకేసారి 1,125 వాహనాలు పార్క్‌ చేయొచ్చు. 

Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

Special Algorithm: హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం! 

 

ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్‌ నిట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్‌ టు ఎన్‌హాన్స్‌ సెక్యూరిటీ అండ్‌ ఇంప్రూవ్‌ ద ఫాల్ట్‌ టాలరెన్స్‌’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. 

Also read: Abhijit Sen: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ మరణం

గతంలో దేశంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్‌ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్‌ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. 

Also read: Dadabhai Naoroji: లండన్‌ లో దాదాభాయ్‌ నౌరోజీ స్మృతికి నీరాజనం

Infra Focus Award: ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్‌ఫ్రా ఫోకస్‌’ అవార్డు

తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్‌ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాసిన లేఖలో ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 27న ఢిల్లీలోని హయత్‌ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్‌నాథ్‌ను టైమ్స్‌ గ్రూప్‌ ఆహ్వానించింది. నీతి ఆయోగ్‌ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది.

Also read:TS SERPకు జాతీయ స్థాయిలో గుర్తింపు

+ సముద్ర వాణిజ్యంపై దృష్టి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్‌ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్‌ డ్రగ్‌ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్‌ టైమ్స్‌ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది.

Also read: Central Rural Development Department: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే..

2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

 

ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా(Neeraj Chopra) మరోసారి డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 8 న జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ డైమండ్ లీగ్ క్రౌన్ (win Diamond League CROWN) గెలుచుకున్నాడు.  రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. 

Also read: Central Sahitya Akademi Award: పత్తిపాక మోహన్‌కు బాలల సాహిత్య పురస్కారం

గతంలోనూ రెండు సార్లు అద్భుత ప్రదర్శనంతో టాపర్ గా నిలాచడు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా.. ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచాడు..

ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న(World Championship) మొదటి భారతీయుడిగా మరో చారిత్రక ఘనత సాధించాడు.

Also read: World Athletics Championships 2022 : నీరజ్‌ చోప్రాకి రజతం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 09 Sep 2022 06:05PM

Photo Stories