Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 29th కరెంట్ అఫైర్స్
One Nation One Uniform : పోలీసులకి ఒకే యూనిఫాం ఉండాలి : మోదీ
పోలీసులకు దేశవ్యాప్తంగా ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ భావనపై ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే వాటిపై దీన్ని రుద్దబోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. పోలీసు బలగాలకు ఇది ఉమ్మడి గుర్తింపునిస్తుందన్నదే నా ఉద్దేశం. కావాలంటే యూనిఫాంపై రాష్ట్రాలవారీగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ఉండవచ్చు. ఇది వీలైతే ఇప్పుడు, లేదంటే ఐదేళ్లు, పదేళ్లు, వందేళ్లకు ఎప్పటికైనా సాధ్యపడొచ్చు’’ అని సూచించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంబేద్కర్: ఎ లైఫ్' పుస్తకం ఎవరు రాశారు?
హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శిబిర్‌ను ఉద్దేశించి మోదీ అక్టోబర్ 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గన్నులు, పెన్నులు... ఇలా నక్సలిజం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిందే. యువత మనసులను విషపూరితం చేసి వారిని తీవ్రవాదంవైపు మళ్లించకుండా నిరోధించాల్సిందే. అందుకోసం ఈ తీవ్రవాద శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. దేశ క్షేమం దృష్ట్యా ఈ శక్తులు విజృంభించకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ‘‘పాత చట్టాలను సమీక్షించుకోండి. కాలం చెల్లిన వాటిని వదిలించుకోండి. మిగతా వాటిని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మెరుగు పరుచుకోండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అయినా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి. పౌరుల పరిరక్షణే అంతిమ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలి’’ అని సూచించారు. నేరాల స్వభావం అంతరాష్ట్రీయ, అంతర్జాతీయ తరహాను సంతరించుకుంటున్నందున ఇది తప్పనిసరన్నారు. సైబర్ క్రైం, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాల్లో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నందున ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా వారికంటే ముందే ఉండాలన్నారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఫేక్ న్యూస్‌కు తెర పడాలి
కొంతకాలంగా ఫేక్ న్యూస్ పెద్ద బెడదగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తిని తక్షణం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది దేశానికే ముప్పుగా పరిణమించగలదన్నారు. ‘‘ఏ సమాచారాన్నయినా ఫార్వర్డ్ చేసే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అందుకు వీలు కలి్పంచే వ్యవస్థలను వారికి చేరువ చేయడంలో టెక్నాలజీది కీలక పాత్ర’’ అని చెప్పారు. టెక్నాలజీపై వెచి్చంచే మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని అన్నారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో పర్యాటక పోలిసింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ T20 2022లో ఏ జట్టు గెలిచింది?
అవినీతిపరులను వదిలేది లేదు
అవినీతికి పాల్పడితే వ్యక్తులనైనా, సంస్థలనైనా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. అక్టోబర్ 31న మొదలవుతున్న విజిలెన్స్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతికి సందేశమిచ్చారు. అవినీతి సామాన్యుల హక్కులను హరించడమే గాక దేశ ప్రగతిని కూడా కుంటుబరుస్తుందన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కూడా పిలుపునిచ్చారు.
PM Modi : మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్‌ఎస్ విక్రాంతే తార్కాణం
భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా హజీరాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
North Korea క్షిపణి ప్రయోగం
అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలకు దిగింది. అక్టోబర్ 28న రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఇవి రెచ్చగొట్టే చర్యలేనంటూ దక్షిణ కొరియా దుయ్యబట్టింది. ఉత్తరకొరియా అణుదాడులకు దిగితే కిమ్ పాలన అంతం ఖాయమని అమెరికా హెచ్చరించింది.
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై EU BAN
2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు అక్టోబర్ 27న అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది.
Laddakh: లద్దాఖ్ పోదాం... పాలపుంతను చూద్దాం
ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశీ్మర్‌లోని లద్దాఖ్ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్‌తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్ క్యాంప్ నుంచి కనిపించే అద్భుతమిది. దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
Twitter : కొనుగోలు చేసిన ఎలెన్ మస్క్
దాదాపు ఆరేడు నెలలకు పైగా నడుస్తున్న మస్క్–ట్విటర్ ప్రహసనానికి ఎట్టకేలకు తెరపడింది. ముందుగా ఇచ్చిన 44 బిలియన్ డాలర్ల ఆఫర్ మేరకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. డీల్ పూర్తయిన వెంటనే తన ప్రణాళికలను కూడా చకచకా అమలు చేయడం ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారంలో తనను బాగా ఇబ్బంది పెట్టారని భావిస్తున్న ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రవాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ షాన్ ఎడ్జెట్‌లపై తక్షణం వేటు వేశారు. వారిలో ఒకరిని అవమానకరమైన రీతిలో .. ట్విటర్ ఆఫీసు నుండి దాదాపు గెంటివేసినంత పని చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంతో ట్విటర్ వ్యాపారం, ఉద్యోగులు, వాటాదారుల భవిష్యత్‌పై కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. కానీ, కంపెనీని కొంటే 75 శాతం మందిని తీసేస్తానంటూ మస్క్ గతంలో చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అలాంటిదేమీ ఉండబోదంటూ మస్క్ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, మస్క్ చేతికి చేరిన నేపథ్యంలో అక్టోబర్ 28న నుండి ట్విటర్ షేర్లలో ట్రేడింగ్ నిలి్చపోయింది.
మంచి రోజులు..
గురువారం పొద్దుపోయాకా టేకోవర్‌ను పూర్తి చేసిన మస్క్ .. ట్విటర్ లోగో అయిన ’పిట్ట’ను తలపించేలా ’పక్షికి స్వేచ్ఛ’ ఇచ్చానంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు బుధవారం రోజున చేతిలో ’వాష్ బేసిన్ సింకు’ పట్టుకుని, స్వయంగా ట్విటర్ కార్యాలయానికి వెళ్లి మస్క్ .. అక్కడ హల్‌చల్ చేశారు. ఆపైన ప్రకటనకర్తలను ఉద్దేశించి కూడా ఒక సందేశం పంపారు. హింసకు తావు లేకుండా ఎలాంటి విషయంపై అయినా ఆరోగ్యకరమైన చర్చ జరిగే వేదికగా తీర్చిదిద్దేందుకే ట్విటర్‌ను తాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టేకోవర్ పూర్తయ్యాక శుక్రవారం రోజున ‘ఇక నుంచి అన్నీ మంచి రోజులే‘ అంటూ మరో ట్వీట్ చేశారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
నిబంధనలు పాటించాల్సిందే: భారత్
ట్విటర్ ఎవరి చేతిలో ఉన్నా భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీని మస్క్ టేకోవర్ చేసినంత మాత్రాన దేశంలో నిబంధనలు మారిపోవని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కంపెనీలకు భారత్ భారీ మార్కెట్‌గా ఉంటోంది. అయితే, ఇటీవలి కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్‌కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. టెస్లా కార్ల దిగుమతి సుంకాలు, స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విషయంలో భారత ప్రభుత్వంతో మస్క్ కు కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముందుకి .. వెనక్కి ..
ఈ ఏడాది జనవరి నుంచి ట్విటర్‌లో కొద్దికొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచి్చన మస్క్ ... ఏప్రిల్ నాటికి 3 బిలియన్ డాలర్ల విలువ చేసే 9 శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు. అదే నెలలో షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇచ్చి 44 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనేస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. దీనిపై కొంత ఊగిసలాడిన ట్విటర్ ఆ తర్వాత ఆఫర్‌కు అంగీకరించింది. అయితే, ఆఫర్ ఇచ్చేసినప్పటికీ ఆ తర్వాత ఏదో రకంగా దీన్నుంచి బైటపడేందుకు మస్క్ అన్ని ప్రయత్నాలు చేశారు. నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడం లేదంటూ ఒకసారి, కంపెనీ విధానాల్లో లొసుగులపై ప్రజావేగు ఆరోపణలను అడ్డం పెట్టుకుని మరోసారి .. డీల్‌ను రద్దు చేసుకుంటానంటూ ప్రకటనలు చేశారు. దీంతో మస్‌్కను ట్విటర్ న్యాయస్థానానికి లాగింది. ‘తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడదనే ఉద్దేశంతోనే ట్విటర్, దాని షేర్‌హోల్డర్లకు ఇచి్చన మాటను మస్క్ తప్పుతున్నారు‘ అని ఆరోపించింది. దీనికి మస్క్ కూడా కౌంటర్ పిటీషన్ వేశారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి అక్టోబర్‌లో విచారణకు వచి్చంది. ఈ దశలో తనపై వేసిన దావాను వెనక్కి తీసుకుంటే అప్పట్లో చెప్పిన రేటు ప్రకారమే కొంటానంటూ ట్విటర్‌కు మస్క్ మరో ఆఫర్ ఇచ్చారు. కానీ డీల్‌ను మరింత జాప్యం చేసేందుకే ఆయన దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ ట్విటర్ లాయర్లు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28లోగా డీల్ సంగతి తేల్చాలని, లేకపోతే తదుపరి నవంబర్‌లో విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందంటూ మస్‌్కకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
పరాగ్, విజయ అంటే అందుకే అయిష్టం..
మస్క్ చేతికి ట్విటర్ వచి్చన వెంటనే ఉద్వాసనకు గురైన పరాగ్ అగ్రవాల్ .. గతేడాది నవంబర్‌లోనే సంస్థ సహ–వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. బాంబే ఐఐటీలోనూ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం చేసిన అగ్రవాల్ .. దాదాపు దశాబ్దం క్రితం ట్విటర్‌లో చేరారు. తర్వాత సీఈవోగా ఎదిగారు. ట్విటర్ టేకోవర్ వ్యవహారంలో మస్‌్కతో బహిరంగంగాను, ప్రైవేట్‌గాను అగ్రవాల్ పోరాటం సాగించారని, అందుకే ఆయనపై మస్క్ కత్తిగట్టారని న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పేర్కొంది. అలాగే హైదరాబాదీ అయిన లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె (48) విషయానికొస్తే .. అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రద్దు చేయడం ద్వారా ఆమె వార్తల్లోకెక్కారు. ’కంటెంట్‌ను క్రమబదీ్ధకరించడంలో ట్విటర్ నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారు’ అంటూ విజయపై కూడా మస్క్ విమర్శలు గుప్పించారు. కంపెనీ తన చేతికి వచ్చీ రాగానే ఆమెను తప్పించారు. అయితే, ఉద్వాసనకు గురైన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే పరిహారం ముట్టనుంది. వారి వాటాలను కొనుగోలు చేసేందుకు, అర్ధాంతరంగా తొలగించినందుకు గాను పరిహారం కింద ఆయా ఉద్యోగులకు మస్క్ దాదాపు 200 మిలియన్ డాలర్లు చెల్లించుకోవాల్సి రానుంది. అత్యధికంగా విజయకు 74 మిలియన్ డాలర్లు, అగ్రవాల్‌కు 65 మిలియన్ డాలర్లు, సెగాల్‌కు 66 మిలియన్ డాలర్లు లభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Arogyasri 2.0 : రెట్టింపు భరోసా - ఇక 3,255 చికిత్సలకు వర్తింపు
రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రెట్టింపు భరోసా కల్పించారు. ఆయా వర్గాల ప్రజలు దురదృష్టవశాత్తు ఏదైన జబ్బు బారిన పడిన సందర్భాల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ పథకం పరిధిలోకి మరో 809 చికిత్సలను కొత్తగా చేర్చి, మొత్తం 3,255 వైద్య చికిత్సల(ప్రక్రియలు)తో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 2.0’ను అక్టోబర్ 28న తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 2,446 చికిత్స ప్రక్రియల సంఖ్య 3,255కు చేరింది. ఇవన్నీవెంటనే అందుబాటులోకి వచ్చాయి.
Also read: Family doctors: లక్షకుపైగా కుటుంబాలకు సమకూరనున్న ‘ఫ్యామిలీ డాక్టర్లు’
చరిత్ర సృష్టించిన సీఎం జగన్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్ టీడీపీ హయాంలో నిర్వీర్యం అయిన ఈ పథకానికి ఊపిరి లూదేలా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా అడుగులు ముందుకు వేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా వడివడిగా అడుగులు వేశారు. 2020 జనవరిలో చికిత్సలను 2059కి పెంచారు. అదే సంవత్సరం జూలైలో 2,200 చికిత్సలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్సల ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి పలు పెద్ద చికిత్సలతో సహా 2,436కు పెంచారు. 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసింది. ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం జగన్ సర్కార్.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి 2021 మే, జూన్ నెలల్లో చేర్చింది. తాజాగా మరో 809 చికిత్సలను చేర్చడంతో మొత్తం చికిత్సల ప్రక్రియలు 3,255కు పెరిగింది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 2,196 చికిత్సలను పథకంలో చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది.
Also read: Old Age Home : సిద్దిపేటలో ప్రభుత్వ వృద్ధాశ్రమం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP