Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 12th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 12th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 12th 2022
Current Affairs in Telugu August 12th 2022


14th Vice Presidentగా ధన్‌ఖడ్‌ ప్రమాణం

భారత ఉపరాష్ట్రపతిగా.. దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన ద్రౌపదీ ముర్ము ఆయన చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌ ఇందుకు వేదికైంది.      హిందీలో ‘దైవసాక్షిగా’.. అంటూ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, ఇతర ముఖ్యలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ఉదయం ధన్‌ఖడ్‌ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. 

Also read: Common Wealth Fencing లో భవానికి స్వర్ణం

2019 నుంచీ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న ధన్‌ఖడ్‌ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాను ఓడించారు. గతంలో ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. 

Also read: ED HYD అడిషనల్ డైరెక్టర్ గా దినేష్‌ పరుచూరి

SC on Freebies : ఆగస్టు 17లోగా సూచనలివ్వాలి..​​​​​​​

ఉచిత పథకాలు, సామాజిక సంక్షేమ పథకాలు రెండూ వేర్వేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు, ఖజానాపై పడే ఆర్థిక భారానికి మధ్య సంతులనం ఉండాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల వేళ పార్టీల ఉచిత వాగ్దానాలను వ్యతిరేకిస్తూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం, సదరు పార్టీల గుర్తును, గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరడం తెలిసిందే. దీనిపై సీజేఐ, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం ఆగస్టు 11న విచారణ జరిపింది. పార్టీల గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు జస్టిస్‌ రమణ నిరాకరించారు. 

Also read: Digital Loans : ఆర్బీఐ నిబంధనలు కఠినతరం

‘ఎన్నికలప్పుడు పార్టీల అలవిగాని ఉచిత హామీలు ఆందోళన కలిగించే విషయమే. వాటిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చట్టపరంగా  ఏర్పాటూ లేకపోవడమూ నిజమే. అయినా సరే, అలాంటి హామీలిచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయడం అప్రజాస్వామికమవుతుంది. పార్టీల గుర్తింపు రద్దు శాసన వ్యవస్థ పరిధిలోని అంశం. అందుకే అలాంటి అంశాల్లోకి వెళ్లదలచుకోవడం లేదు. నేను వెనకాడుతున్నానని అనుకున్నా, సంప్రదాయవాదిని అనుకున్నా సరే, శాసనపరమైన అంశాల్లో వేలు పెట్టలేను’ అని స్పష్టం చేశారు. 

Also read: ED HYD అడిషనల్ డైరెక్టర్ గా దినేష్‌ పరుచూరి

ఉచితాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్‌ లాయర్లు సలహాలిచ్చారని సీజేఐ గుర్తు చేశారు. తాను ఆగస్టు 26న రిటైరవనున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆలోగా విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా కేసుతో సంబంధమున్న మిగతా వారు  17లోగా సూచనలివ్వాలని సూచించారు. ‘ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండూ భిన్నమైన అంశాలు. పైగా ప్రజా సంక్షేమం, ఆర్థిక భారం మధ్య సంతులనం తప్పనిసరి. అందుకే మనందరం ఇంతగా చర్చిస్తున్నాం. అందుకే దయచేసి ఈ విషయమై నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలను నా రిటైర్మెంట్‌కు ముందే సమరి్పంచండి’’ అని విజ్ఞప్తి చేశారు. 

Also read: Covid Booster Dose గా కోర్బావ్యాక్స్

ప్యానెల్‌పై కేంద్రం సిఫార్సులు 
ఇటీవలి కాలంలో కొన్ని పార్టీలు ఉచితాల పంపకాన్ని ఓ కళగా మార్చేశాయని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ‘ఎన్నికలు కేవలం ఉచితాల ప్రాతిపదిక మీదే జరుగుతుండటం ఆందోళనకర పరిణామం. మన ఎన్నికల వ్యవస్థలో అన్నింటినీ ఉచితంగా పంచేయడాన్నే సామాజిక సంక్షేమ చర్యలుగా కొన్ని పార్టీలు భావిస్తుండటం దురదృష్టకరం’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘ఇది పూర్తిగా అశాస్త్రీయమైన దృక్పథం. చివరికిది ఆర్థిక వినాశనానికే దారితీస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. దేశ విద్యుత్‌ రంగంపై నెలకొన్న విపరీతమైన ఆర్థిక ఒత్తిడే ఇందుకు తాజా ఉదాహరణ అన్నారు. ‘అందుకే, దీనిపై శాసన వ్యవస్థ, ఈసీ వంటివి నిర్ణయం తీసుకునేలోపు సుప్రీంకోర్టు తాత్కాలిక చర్యలు చేపట్టాలి. ఉచితాల విషయమై పార్టీలకు విధి నిషేధాలను ఏర్పరచాలి’ అని విజ్ఞప్తి చేశారు. నిపుణుల ప్యానల్‌కు సంబంధించి కేంద్రప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆయన కోర్టు ముందుంచారు. జాతీయ పార్టీలు, 15వ ఆర్థిక సంఘం చైర్మన్, ఆర్బీఐ ప్రతినిధి, నీతీ ఆయోగ్‌ సీఈఓ, రిటైర్డ్‌ కాగ్, ఫిక్కీ ప్రతినిధులు తదితరులను ప్యానల్లోకి తీసుకోవాలని సూచించారు.  

Also read: Quiz of The Day (August 11, 2022): ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వికాస్‌సింగ్‌ చేసిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు జస్టిస్‌ రమణ చెప్పారు. ‘ఉచితాలు అందుకునే వారు అవి కావాలనే కోరుకుంటారు. మనది సంక్షేమ రాజ్యం.  మనం కట్టే పన్నులు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడాలని కొందరంటారు. కాబట్టి మనం రెండువైపులూ వినాలి’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. 

Also read: Commonwealth Games 2022: స్క్వాష్‌లోచరిత్ర సృష్టించిన సౌరభ్‌

Atal Pension Yojana : పన్ను చెల్లింపుదారులకు కట్‌​​​​​​​

 పన్ను చెల్లింపుదారులు అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్‌ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పెన్షన్‌ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్‌ 1, ఆ తర్వాత నుంచి APYలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 11th కరెంట్‌ అఫైర్స్‌

అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్‌ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్‌ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్‌ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది.

 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Aug 2022 06:17PM

Photo Stories