Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 10th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 10th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 10th 2022
Current Affairs in Telugu August 10th 2022


Maharastra Cabinet లోకి 18 మంది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆగస్టు 9న కేబినెట్‌ను విస్తరించారు. రెబెల్‌ శివసేన వర్గం, బీజేపీలకు చెరో 9 మంది చొప్పున మంత్రి పదవులు దక్కాయి. దీంతో, సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌తో కలిపి కేబినెట్‌ మంత్రుల సంఖ్య 20కి చేరింది. మహారాష్ట్ర కేబినెట్‌లోకి గరిష్టంగా 43 మందిని తీసుకునే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ సహా 18 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. శాసనసభలోని 11 మంది, మండలిలోని ఒక సభ్యురాలితో కలిపి బీజేపీకి ఉభయ సభల్లో 12 మంది మహిళా సభ్యులుండగా, షిండే వర్గంలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, ఇంకా స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరున్నారు. ఈ విస్తరణలో ఒక్క మహిళకు కూడా చోటుదక్కలేదు.  

Also read: Quiz of The Day (August 10, 2022): హైదరాబాద్ అంబేద్కర్ గా ఎవరిని పేర్కొంటారు?

PM Modi Assets రూ.2.23 కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు ఏడాదిలో రూ.26 లక్షలు పెరిగాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రధానికున్న చరాస్తుల విలువ రూ.1,97 కోట్ల నుంచి 2021–22 నాటికి  రూ.2.23 కోట్లకు చేరుకుంది. ఆయనకు స్థిరాస్తులు ఏమీ లేవు. సొంత కారు కూడా లేదు. ప్రధానమంత్రి కార్యాలయం మోదీ ఆస్తుపాస్తుల్ని ఆగస్టు 9న వెల్లడించింది. 

Also read: Bihar CM Nitish Kumar : బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వి తేజస్వి యాదవ్‌

ప్రధాని చరాస్తులు విలువ 2022 మార్చి 31 నాటికి 2 కోట్ల 23 లక్షల 82వేల 504 రూపాయలున్నట్టుగా పీఎంఓ వెబ్‌సైట్‌లో వివరాల ద్వారా వెల్లడవుతోంది. ప్రధాని మోదీ చేతిలో ప్రస్తుతం రూ.32,250 ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన దగ్గరున్న డబ్బులు తగ్గిపోయాయి. గత ఏడాది ఆయన చేతిలో రూ.36,900 ఉన్నాయి. 

Also read: Indian Polity Bit Bank For All Competitive Exams: బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో బెంగాల్‌లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?

గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌సీఎస్‌ శాఖ ఖాతాలో రూ.46,555 రూపాయలు ఉన్నాయి. గత ఏడాది రూ.1,52,480గా ఉన్న బ్యాలెన్స్‌ కూడా బాగా తగ్గింది. అదే అకౌంట్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ2,10,33,226 ఉన్నాయి. పోస్టాఫీసులో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ కింద రూ.9,05,105 ఉండగా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కింద రూ.1,89,305 ఉన్నాయి. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువున్న ఆ ఉంగరాలు రూ.1,73,063 విలువ చేస్తాయి.  గత ఏడాదితో పోల్చి చూస్తే ప్రధాని ఆస్తుల విలువ రూ.26 లక్షలు పెరిగి రూ.2,23,82,504కి చేరుకుంది. మోదీకి ఎలాంటి స్థిరాస్తులు లేవు. గుజరాత్‌ గాంధీనగర్‌లో తనకున్న రెసిడెన్షియన్‌ ప్లాట్‌ని ఆయన విరాళంగా ఇచ్చేశారు. సర్వే నెంబర్‌ 401–ఏ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడి ఆస్తిగా ఆ జాగా ఉండేది. అయితే తన వాటాగా ఉన్న జాగాని ప్రధాని విరాళంగా ఇచ్చేశారు. ఆ జాగా మార్కెట్‌ విలువ రూ.1.10 కోట్లు

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 9th కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర మంత్రుల్లో 10 మంది ఆస్తుల్ని పీఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆస్తుల విలువ రూ.2.54 కోట్లు ఉంటే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కున్న ఆస్తులు రూ.2.92 కోట్లు ఉన్నాయి. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనకున్న ఆస్తులు రూ.35.63 కోట్లని వెల్లడించారు.  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చరాస్తులు రూ.1.43 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.8.21 కోట్లుగా ఉంది. ఆయన భార్య జి. కావ్య పేరుమీద రూ.75 లక్షల వరకు అప్పులున్నాయి. 

Also read: Most Distant Star ఎరెండల్

హైదరాబాద్ లో National volleyball పోటీలు

గ్రామస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ బీచ్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు ఎంసీహెచ్‌ఆర్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిలో ఆగస్టు 10 నుంచి నాలుగు రోజులపాటు జాతీయ వాలీబాల్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌ జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థులు, వాలీబాల్‌ క్రీడాకారులు ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా అంతర్జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు కృష్ణంరాజు ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో వాలీబాల్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రారంభమైన ఈ పోటీలు నేడు జాతీయస్థాయికి చేరుకున్నాయి.   

Also read: GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్‌

ఈ జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీల్లో సుమారు 80 టీంలు, సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

Government e - Marketplace లోకి సహకార సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్‌ (ఆన్‌లైన్‌ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్‌) ‘జెమ్‌’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్‌ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. జెమ్‌ (Government e - Marketplace (GEM)) పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా ఆగస్టు 9న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్‌ సొసైటీలు సైతం జెమ్‌ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్‌ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్‌/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. 

5G Services : ఎయిర్ టెల్, జియో పోటా పోటీ   

దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్ జియో సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆగస్టులోనే ఈ సేవలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నాయి.  

2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ ప్రకటించారు. 5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్‌వర్క్‌ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉందని తెలిపారు. మొబైల్‌ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువని... టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక్కో యూజర్‌ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోందని... ఇది త్వరలో రూ.200లకు చేరుతుందని అన్నారు. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుందని వివరించారు. 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశంలో అతిపెద్ద Ikea స్టోర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను ఎయిర్ టెల్ దక్కించుకుంది. స్పెక్ట్రమ్‌ కొనుగోలుకై ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు వెచ్చించింది.  టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.  

Also read: Quiz of The Day (August 08, 2022): భారత్‌లో యునెస్కో గుర్తించిన తొలి వారసత్వ నగరమేది?

టెలికం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో సైతం 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్‌ మెరుగ్గా ఉంటుందని జియో తెలిపింది. యూజర్‌ భవనం లోపల ఉన్నా కవరేజ్‌ ఏమాత్రం తగ్గదు అని వివరించింది. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వెల్లడించింది. స్పెక్ట్రమ్‌ కొనుగోలుకై జియో రూ.88,078 కోట్లు వెచ్చించింది. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?

అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ Common Charger


కొత్త ఎల్రక్టానిక్‌ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్‌ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై మొబైల్స్‌ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 2024 నాటికి చిన్న ఎల్రక్టానిక్‌ పరికరాలన్నింటికీ యూఎస్‌బీ–సీ పోర్ట్‌ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది.

Also read: Internet: అతి తక్కువ ధరకే ఇంటర్నెట్‌ లభ్యం

Nepal Cricket హెడ్‌ కోచ్‌గా ప్రభాకర్‌ 


భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ నేపాల్‌ జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్‌ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్‌ అన్నాడు.

Also read: NITI Aayog: నీతి ఆయోగ్‌ సీఈవోగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియామకం

మాజీ అంపైర్ Rudi Koertzen దుర్మరణం 

దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెట్‌, అంపైర్‌ రూడి కొయెట్జన్‌ కారు ప్రమాదంలో మృతి చెందారు. గోల్ఫ్‌ ఆడేందుకు స్నేహితులతో వెళ్లిన ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయనకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. 1992 నుంచి 2010 వరకు 397 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ (128 టెస్టులు, 250 వన్డేలు, 19 టి20లు)లకు ఆయన అంపైర్‌గా వ్యవహరించారు. ఆయన విశేష అనుభవాన్ని గుర్తించి ఐసీసీ 2002లో ఎలైట్‌ ప్యానెల్‌లో చోటిచ్చింది.    

Chess Olympiod : భారత జట్లకు కాంస్య పతకాలు  

భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్లకి రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఆగస్టు 8న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్‌ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్‌ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.  

Also read: CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు

నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్‌ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 6th కరెంట్‌ అఫైర్స్‌

చివరిదైన 11వ రౌండ్‌లో భారత్‌ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్‌ తమ ప్రత్యర్థులపై గెలిచారు.  

Also read: Indian Citizenship: మూడేళ్లలో 3,92,643 మంది పౌరసత్వం వదులుకున్నారు

మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. చివరిదైన 11వ రౌండ్‌లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్‌ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్‌ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్‌ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. 

Also read: World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

క్లాసికల్‌ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్‌ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో పరిమార్జన్‌ నేగి, సేతురామన్, కృష్ణన్‌ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్‌ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్‌ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్‌లైన్‌ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్‌లైన్‌లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్‌ కాంస్యం సాధించింది.   

Also read: Indian Navy : నేవీలో నారీ ఘనత..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Aug 2022 06:27PM

Photo Stories