Current Affairs Today's Headlines Live Updates: మే 9వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
➤ పాకిస్థాన్ ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్
పాకిస్థాన్ దొంగ బుద్ధికి గుణపాఠం చెప్పేందుకు భారతదేశం సిద్ధమైంది. మే 8వ తేదీ పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇది పాకిస్తాన్ నేరుగా దాడికి పాల్పడినట్లు రుజువు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆర్మీ డ్రోన్లను తయారు చేసింది ఈ కంపెనీలోనే..
భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్ ఎల్బిట్ సెక్యురిటీ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ సరిహద్దు జిల్లాల్లో 'హై అలర్ట్'
భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆస్పత్రులపై ‘రెడ్ క్రాస్’ సింబల్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలకు, సైనికులకు ఎలాంటి వైద్య ఆటంకం కలగకూడదనే దృష్టితో వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ పాక్‌తో యుద్ధానికి గగన్‌యాన్ వ్యోమగామి సిద్ధం
గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ తిరిగి వాయుసేనలోకి భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ తిరిగి భారతీయ వాయుసేన(IAF)లో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఏటీఎంలు మూసివేత.. స్పందించిన పీఐబీ
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడనున్నాయనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ పాకిస్తాన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన ప్రాంతాలు ఇవే..
భారత సాయుధ దళాలు పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దురాగ్రహాన్ని సమర్థవంతంగా అడ్డుకొని, శత్రు దేశంపై కఠినమైన ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులకు పాల్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- competitive exams current affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News
- Latest Current Affairs