Current Affairs Today's Headlines Live Updates: మే 7వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
➤ ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన వీడియో వైరల్
భారత సైన్యం పాకిస్థాన్‌లోని మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేయడానికి ముందు ఒక రహస్యమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. సైనికులు ఆయుధాలు లోడ్ చేయడం, ట్యాంకులతో కాల్పులు జరపడం వంటి దృశ్యాలు ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ దేశ చరిత్రలో తొలిసారిగా శబరిమలకు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 19న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయాన్ని దర్శించనున్న తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఈ విషయాన్ని ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్దేవస్వం బోర్డు (TDB) అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ జర్మనీ కొత్త చాన్స్‌లర్‌గా ఫ్రెడరిక్ మెర్జ్
మే 6వ తేదీన జరిగిన జర్మనీ చాన్స్‌లర్ ఎన్నికల్లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్యూ) కూటమి నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ రెండో ప్రయత్నంలో చాన్స్‌లర్‌గా ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(UK) మధ్య గత మూడేళ్లుగా కొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు ఫలవంతమయ్యాయి. మే 6వ తేదీ ఈ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ 'ఆపరేషన్ సిందూర్'లో.. ఇద్దరు మహిళా అధికారుల కీలక పాత్ర
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 6వ తేదీ అర్ధరాత్రి భారత సైన్యం చేపట్టిన అత్యంత సమర్థవంతమైన వైమానిక దాడిని 'ఆపరేషన్ సిందూర్' అని నామకరణం చేశారు. ఈ దాడిలో ధైర్యవంతులైన ఇద్దరు మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆపరేషన్ సిందూర్‌లో.. భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఇవే..!
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబులు, కామికాజీ డ్రోన్లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ కేవలం 23 నిమిషాల్లోనే పూర్తయింది. ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన ఆయుధాలు ఇవే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ పారా మిలిటరీ బలగాల సెలవులు రద్దు
'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని అన్ని పారా మిలటరీ బలగాల సెలవులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. సెలవులో ఉన్న సిబ్బందిని వెంటనే విధులకు హాజరు కావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ‘ఆపరేషన్ సిందూర్’ పేరు వెనుకున్న కారణం ఇదే
పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్నారు. మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్‌పై భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ పేరు వెనుక ఉన్న కారణం ఇదే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆపరేషన్ సిందూర్‌కు భారత్ ఎంచుకున్న 9 ఉగ్రవాద శిబిరాలు ఇవే..
పహల్గామ్ ఉగ్రదాడికి నిర్దిష్టమైన ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన దాడులు చేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో లక్ష్యంగా చేసుకున్న 9 ఉగ్రవాద స్థావరాల జాబితా ఇదే..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- competitive exams current affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News
- Latest Current Affairs