Current Affairs Today's Headlines Live Updates: ఏప్రిల్ 30వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
➤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా 2025 మే 29వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణం స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ గవాయ్
భారతదేశ సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 29వ తేదీ అధికారికంగా ఆమోదం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ రేపటి నుంచి కనిపించని 15 బ్యాంకులు ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన ఆర్థిక సంస్కరణను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంక్‌గా మార్చనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ మే 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్, రైల్వే, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు..!
మే 1వ తేదీ నుంచి అనేక కీలక మార్పులు చోటు చేసుకోబుతున్నాయి. బ్యాంకు ఖాతా నిబంధనల నుంచి ఏటీఎం లావాదేవీలు, వంటగ్యాస్ ధరల వరకు చాలా విషయాల్లో మార్పులు రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ తెలంగాణలో మిస్ వరల్డ్–2025 పోటీలు
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన మిస్ వరల్డ్–2025 పోటీలు ఈ సారి తెలంగాణ రాష్ట్రం వేదికగా జరగనున్నాయి. మే 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ పాకిస్తాన్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్
భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్‌ను ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా నిషేధం విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆయుష్మాన్ భారత్ దివాస్
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ ఆయుష్మాన్ భారత్ దివాస్‌ను జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ యోజన గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- Competitive Exams
- Current Affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News