చంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
Sakshi Education
అస్సాంలోని కామ్రూప్ జిల్లా చంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుతోపాటు బ్రహ్మపుత్ర నదిపై ఆరు వరుసల వంతెన, నార్త్ ఈస్టర్న్ గ్యాస్ గ్రిడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ ఓ సభలో మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బిల్లు ద్వారా అస్సాం లేదా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని ఆయన భరోసా ఇచ్చారు. అస్సాంను దేశానికి పెట్రోలియం, గ్యాస్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ పర్యటించిన మోదీ అక్కడ రూ. 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చంగ్సారీ, కామ్రూప్ జిల్లా, అస్సాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చంగ్సారీ, కామ్రూప్ జిల్లా, అస్సాం
Published date : 11 Feb 2019 05:13PM