Skip to main content

చంద్రయాన్-2 98 శాతం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.
చంద్రయాన్-2లో అమర్చిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మాత్రం పునరుద్ధరించలేకపోయినట్లు సెప్టెంబర్ 21న తెలిపారు. ల్యాండర్‌కి ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషణ చేస్తోందని తెలిపారు. చంద్రయాన్-2లో ఆర్బిటర్ మాత్రం చాలా బాగా పని చేస్తోందని పేర్కొన్నారు. చంద్రయాన్-2 ఫలితం ప్రభావం గగన్‌యాన్ ప్రయోగంపై ఉండబోదని శివన్ స్పష్టం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చంద్రయాన్-2 98 శాతం విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఇస్రో చైర్మన్ శివన్
Published date : 23 Sep 2019 05:34PM

Photo Stories