Skip to main content

చంద్ర దర్శన వెబ్‌సైట్ ప్రారంభం

రంజాన్, ఈద్ పండుగల నిర్ణయానికి ఆధారమైన చాంద్రమాన మాసారంభాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాలకు తెరదించుతూ పాకిస్తాన్ చంద్రదర్శన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. www.pakmoonsighting.pk అనే పేరుతో మే 26న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ఈ వెబ్‌సైట్ ద్వారా ముస్లింల ప్రధాన పండుగలయిన రంజాన్, ఈదుల్ ఫితర్, ఈదుల్ అఝా, మొహర్రం వంటి వాటిపై కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. శాస్త్రీయ చాంద్రమాన కేలండర్‌ను రూపొందిస్తున్నట్లు పాక్ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్ చౌదరి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చంద్ర దర్శన వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : మే 26
ఎవరు : పాకిస్తాన్
ఎందుకు : ముస్లింల పండుగలపై కచ్చితమైన సమాచారం తెలుసుకోనేందుకు
Published date : 29 May 2019 05:09PM

Photo Stories