Skip to main content

చందా కొచర్‌నిదోషిగా తేల్చిన కృష్ణ కమిటీ

వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది.
బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ జనవరి 30న ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసినప్పటికీ... కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతోపాటు 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి దాకా చందా కొచర్ పొందిన బోనస్‌లన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని తెలిపింది.

2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ లావాదేవీల ద్వారా చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని కొన్నాళ్ల క్రితం ప్రజావేగు ఒకరు బైటపెట్టడంతో కోచర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం 2018 జూన్ 6న మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చందా కొచర్‌ని దోషిగా తేల్చిన శ్రీకృష్ణ కమిటీ
ఎప్పుడు : జనవరి 30
ఎక్కడ : వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన కేసులో
Published date : 31 Jan 2019 05:56PM

Photo Stories