చలామణి లోకి నూతన సిరీస్ వంద నోటు
Sakshi Education
త్వరలో నూతన సిరీస్ రూ.100 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఫిబ్రవరి 26న ప్రకటించింది.
కొత్త సిరీస్ వంద నోటుపై ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని పేర్కొంది. ఈ నోటు ప్రస్తుతం చెలామణిలో ఉన్నటువంటి రూ.100 నోటు మాదిరిగానే ఉంటుందని అయితే, ఒక్క సిరీస్‌లోనే నూతనత్వం ఉండనుందని వివరించింది. నూతన నోటుతో పాటు పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చలామణి లోకి నూతన సిరీస్ వంద నోటు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : చలామణి లోకి నూతన సిరీస్ వంద నోటు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 27 Feb 2019 05:47PM