చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
Sakshi Education
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 30న నర్మద జిల్లాలోని ప్రఖ్యాత ‘ఐక్యతా శిల్పం(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)’కి దగ్గరలో నాలుగు పర్యాటక ప్రదేశాలను ప్రారంభించారు.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు ఎంత?
ఆరోగ్య వనం: ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని మొదట ప్రారంభించారు. ఈ ఆరోగ్య వనంలో 380 రకాలకు చెందిన సుమారు ఐదు లక్షల ఔషధ మొక్కలున్నాయి.
ఏక్తామాల్: వివిధ రాష్ట్రాల చేనేత, చేతి వృత్తుల ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏక్తామాల్‌నుమోదీ ప్రారంభించారు.
పౌష్టికాహార పార్క్: 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా టెక్నాలజీ ఆధారిత థీమ్ పార్క్ ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు. ‘సరైన పోషణ.. దేశానికి వెలుగు’ నినాద స్ఫూర్తితో చిన్నారులను ఆకర్షించే 47 రకాల ఆకర్షణలు ఇందులో ఉన్నాయి.
జంగిల్ సఫారీ: 375 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘జంగిల్ సఫారీ’నిమోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక జంతు ప్రదర్శన శాలలో పులులు, సింహాలు సహా 100 జంతు, పక్షి జాతులు ఉన్నాయి.
క్విక్ రివ్వూ :
ఏమిటి : నాలుగు పర్యాటక ప్రదేశాలు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు :స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపం, నర్మద జిల్లా, గుజరాత్

Published date : 31 Oct 2020 05:43PM