Skip to main content

చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం

96 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది.
Current Affairsఆగస్టు 30న ముగిసిన ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3-3తో సమంగా నిలిచాయి. ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగా రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ప్రస్తుతం ఫిడే అధ్యక్ష పదవిలో అర్కాడీ ద్వోర్‌కోవిచ్ (రష్యా) ఉన్నారు. ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో 2014లో భారత్ కాంస్య సాధించిన విషయం తెలిసిందే.

భారత బృందంలో...
స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. అలాగే ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్-2020 విజేతలు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : భారత్, రష్యా
Published date : 01 Sep 2020 06:11PM

Photo Stories