చెన్నైలో లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు
Sakshi Education
తమిళనాడు రాజధాని చెన్నైలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2020, మార్చి 18 నుంచి అమల్లోకి రానున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ ) బెంచ్‌ల ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇక్కడ అప్పీలు చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్ మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన అప్పీళ్లు విచారిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల ఉత్తర్వులను సవాలు చేసేందుకు

Published date : 16 Mar 2020 06:33PM