చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
Sakshi Education
చైనాతో ఉన్న రష్యా సరిహద్దును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రష్యా జనవరి 30న ప్రకటించింది.
చైనాలో విస్తరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ వెల్లడించారు. అలాగే చైనీయులకు ఎలక్టాన్రిక్ వీసాల జారీని కూడా నిలిపివేస్తామని పేర్కొన్నారు. తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాము అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. తమ దేశ పౌరులు చైనా పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, చైనాలో వున్న రష్యా పౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు
Published date : 31 Jan 2020 05:38PM