చైనాను ఓడించి ఐరాస మహిళా సమానత్వ కమిషన్‌కి ఎంపికైన దేశం?
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళా సాధికారతలపై పనిచేసే ‘యూఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ వుమెన్’ అనే అంతర్జాతీయ సంస్థలో చైనాను ఓడించి, భారత్ సభ్య దేశంగా ఎంపికైంది.
54 సభ్య దేశాల ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌కి ఏషియా పసిఫిక్ దేశాల కోటాలో జరిగిన ఎన్నికల్లో, చైనాపై భారత్ విజయం సాధించింది. ఐరాస ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీవోఎస్‌వోసీ)కి అనుబంధ సంస్థ అయిన ఈ కమిషన్ మహిళా హక్కులను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా స్త్రీల జీవన చిత్రాన్ని డాక్యుమెంట్ చేయడం, అంతర్జాతీయ స్థాయిలో సమానత్వం, మహిళా సాధికాతలకు ప్రమాణాలు నిర్దేశించడం లక్ష్యంగా పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాను ఓడించి ఐరాస మహిళా సమానత్వ కమిషన్‌కి ఎంపికైన దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాను ఓడించి ఐరాస మహిళా సమానత్వ కమిషన్‌కి ఎంపికైన దేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : భారత్
Published date : 16 Sep 2020 05:20PM