చైనాలో తయారీకి శాంసంగ్ వీడ్కోలు
Sakshi Education
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు అక్టోబర్ 2న ప్రకటించింది.
పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, దేశీయంగా తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2018లో చైనాలోని ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ 2019, జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాలో తయారీకి వీడ్కోలు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్
ఎందుకు : పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, దేశీయంగా తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా

Published date : 03 Oct 2019 05:37PM