Skip to main content

చైనాలో అమెజాన్ ఈ-కామర్స్ సేవలు నిలిపివేత

అమెరికాకు చెందిన ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్.. చైనాలో తన ఈ-కామర్స్ సేవలను 2019, జూలై 18 నుంచి నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.
అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్ కాం, పిన్‌డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్ స్థానాన్ని వదులు కోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మార్కెట్ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెజాన్ ఈ-కామర్స్ సేవలు నిలిపివేత
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : అమెజాన్
ఎక్కడ : చైనా
ఎందుకు : పోటీ కారణంగా
Published date : 24 Apr 2019 05:09PM

Photo Stories