చైనాకి చెందిన ఏ సంస్థతో ఐఓఏ ఒప్పందం రద్దు చేసుకుంది?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్-2021లో పాల్గొనే భారత ఆటగాళ్లు ధరించే కిట్‌లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాద్రా ఇటీవల లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ కిట్‌లను చైనాకు చెందిన ‘లీ నింగ్’ కంపెనీ స్పాన్సర్ చేస్తోంది. అయితే చైనా కంపెనీ తయారు చేసిన దుస్తులతో తమ ఆటగాళ్లు ఒలింపిక్స్ బరిలోకి దిగరని, ‘లీ నింగ్’తో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ఐఓఏ జూన్ 9న ప్రకటించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరీందర్ బాత్రా వెల్లడించారు. ‘మేం కిట్‌ను ఆవిష్కరించిన తర్వాత అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చాయి. ప్రజల సెంటిమెంట్ కోణంలోనే ఆ కంపెనీని పక్కన పెట్టాలని భావించాం.’ అని ఆయన అన్నారు. త్వరలో మరో కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతామని చెప్పారు.
Published date : 10 Jun 2021 07:01PM