Skip to main content

చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకాలు పెంపు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచారు. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేశారు. ఓవైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకునే 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా పన్ను రేటును 10 నుంచి 25 శాతానికి పెంచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకాలు పెంపు
ఎప్పుడు : మే 11
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Published date : 11 May 2019 05:11PM

Photo Stories