చైనా సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం
చైనా సోషల్ మీడియా యాప్‌లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా టిక్‌టాక్, వుయ్ చాట్ యాప్‌లపై నిషేధం విధిస్తూ ఆగస్టు 7న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమలులోకి రానుంది. ఇదిలా ఉండగా టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. భారత్ ఇటీవలే టిక్‌టాక్, వీచాట్‌లతో పాటు చైనాకు సంబంధించిన 106 యాప్‌లపై ఇటీవలే భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
చదవండి: మరో 47 చైనా యాప్‌లపై నిషేధం
భారత్, చైనాలకు వెళ్లకండి..
కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భారత్, చైనా తదితర 50 దేశాలకు వెళ్లరాదని అమెరికా ప్రభుత్వం తన పౌరులను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తితో మార్చిలో జారీ చేసిన ప్రపంచ ఆరోగ్య ప్రయాణ మార్గదర్శకాలను ఎత్తివేసి, దాని స్థానంలో దేశాల వారీ ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టిక్‌టాక్, వుయ్ చాట్ యాప్‌లపై నిషేధం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎందుకు :అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా