Skip to main content

చైనా సొంత నేవిగేషన్ వ్యవస్థ ప్రారంభం

అమెరికాకు చెందిన ప్రఖ్యాత నేవిగేష వ్యవస్థ అయిన గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)కు దీటుగా చైనా సొంతంగా బేడో–3నేవిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (బీడీఎస్‌)ను ప్రారంభించింది.
Current Affairs చైనా తన మిలటరీకి, ముఖ్యంగా క్షిపణి ప్రయోగాల ప్రత్యేక నేవిగేషన్ అవసరాలను బీడీఎస్‌ తీర్చనుంది.ప్రపంచంలో ఎన్నో దేశాలకు సొంతంగా నేవిగేషన్ వ్యవస్థలున్నప్పటికీ అమెరికాకు చెందిన గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)ని ఎక్కువ మంది వినియోగిస్తారు. రష్యాకు గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ కి గెలిలీయో జీపీఎస్‌ వ్యవస్థలున్నాయి. భారత్‌ కూడా సొంతంగా నావిక్‌ పేరుతో ఇండియన్ రీజనల్‌ నేవిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్‌)ను అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్ వంటి దేశాలు చైనా బీడీఎస్‌ వ్యవస్థనే వినియోగిస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బేడో–3నేవిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (బీడీఎస్‌) ప్రారంభం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : చైనా
ఎందుకు : సొంతంగా నేవిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా
Published date : 02 Aug 2020 10:31AM

Photo Stories