చైనా ప్రయోగించిన ఏ శోధక నౌక చంద్రుడి మట్టి నమూనాలను భూమికి చేర్చింది?
Sakshi Education
చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక చాంగె-5 సేకరించిన చంద్రుడి మట్టి నమూనాలు డిసెంబర్ 17న విజయవంతంగా భూమిని చేరాయి.
చాంగె-5 శోధక నౌక చైనా ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజన్‌లోని సిజీవాంగ్ బానర్‌లో ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. నమూనాతో కూడిన క్యాప్సూల్‌ను బీజింగ్ తీసుకెళ్లి అక్కడే తెరుస్తారని తెలిపింది. ఇతర దేశాల శాస్త్రవేత్తలకూ ఈ నమూనాల్లో కొన్నింటిని పరిశోధనలకు అందుబాటులో ఉంచుతామని సీఎన్‌ఎస్‌ఏ డిప్యూటీ డెరైక్టర్ పీ ఝా యూ తెలిపారు.
దాదాపు ఎనిమిది టన్నుల బరువున్న మానవ రహిత అంతరిక్ష నౌక ‘చాంగ్-5(చాంగె-5)’ను నవంబర్ 24న చైనా ప్రయోగించింది. చంద్రుని ఉపరితలంపైని నమూనాలను సేకరించి, తిరిగి భూమిని చేరుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం.
చదవండి:
చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం?(చాంగె-5 పార్ట్-3)
చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశం?(చాంగె-5 పార్ట్-2)
ఏ రాకెట్ ద్వారా చాంగె-5 నింగిలోకి దూసుకెళ్లింది?(చాంగె-5 పార్ట్-1)

Published date : 18 Dec 2020 06:42PM