Skip to main content

చైనా అత్యాధునిక క్షిపణి ప్రయోగం విజయవంతం

అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే జేఎల్-3 ఖండాంతర క్షిపణి(ఎస్‌ఎల్‌బీఎం)ని జూన్ 2న విజయవంతంగా పరీక్షించినట్లు చైనా జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 28న తెలిపింది.
14 వేల కిమీ దూరం ప్రయాణించగల ఈ క్షిపణి, ఒకేసారి పది స్వతంత్ర లక్షిత అణ్వాయుధాలను మోసుకుపోగలదు. చైనా దగ్గర ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎల్‌బీఎంలతో పోలిస్తే ఇది అత్యంత జేఎల్-3 అధునాతనమైనది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జేఎల్-3 ఖండాంతర క్షిపణి(ఎస్‌ఎల్‌బీఎం) ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : చైనా జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ
Published date : 29 Jun 2019 06:19PM

Photo Stories