Skip to main content

చైనా అధ్యక్షుడితో ఇమ్రాన్ ఖాన్ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా రాజధాని బీజింగ్‌లో అక్టోబర్ 9న భేటీ అయ్యారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామని జిన్‌పింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించగలమని అభిప్రాయపడ్డారు. చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం ధృడమైనదని.. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు దీనిని విడదీయలేవని స్పష్టం చేశారు. చైనా, పాక్‌ల మధ్య సహకారం బలంగానే ఉంటుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : బీజింగ్, చైనా
Published date : 10 Oct 2019 06:01PM

Photo Stories