Skip to main content

భూతాపంతో ఏటా 15 లక్షల మంది మృత్యువాత

భూతాపం వల్ల 2100 సంవత్సరం నుంచి భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌తో(టీసీడీ) కలిసి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ 15 లక్షల మరణాల్లో 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో 4,02,280, బిహార్‌లో 1,36,372, రాజస్థాన్‌లో 1,21,809, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ఏపీ, తెలంగాణ) 1,16,920, మధ్యప్రదేశ్‌లో 1,08,370, మహారాష్ట్రలో 1,06,749 మరణాలు సంభవిస్తాయని బహిర్గతమైంది.

క్లైమేట్ ఇంపాక్ట్ అధ్యయనం-అంశాలు
  • ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది.
  • కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి.
  • 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాకై ్సడ్ స్థాయి 408.55 పార్‌‌ట్స పర్ మిలియన్‌గా(పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు, 2100 నాటికి 940 పీపీఎంకు చేరుకోనుంది.
  • 2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరుగుతాయి.
  • సముద్ర తీరం వెంట మట్టి క్షయం తప్పదు. భారీగా తీరం కోతకు గురవుతుంది.
  • తీర ప్రాంతాలు తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నాయి. సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2100 నుంచి ఏటా 15 లక్షల మంది మృత్యువాత
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్(టీసీడీ)-క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్
ఎక్కడ : భారత్
ఎందుకు : భూతాపం వల్ల
Published date : 07 Nov 2019 05:36PM

Photo Stories