Skip to main content

భూటాన్ ప్రధానితో మోదీ సమావేశం

భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
భూటాన్ రాజధాని థింపూలో ఆగస్టు 17న జరిగిన ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్యారంగానికి సంబంధించి ఇరు దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భూటాన్ భారత్‌కు ఎప్పుడూ విశ్వసనీయ పొరుగుదేశమేనని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. మరోవైపు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు.

గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ ప్రారంభం
భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం ఇస్రో సహాయంతో అభివృద్ధి చేసిన గ్రౌండ్ ఎర్త్ స్టేషన్, సాట్కామ్ నెట్‌వర్క్‌ను మోదీ, షెరింగ్ కలిసి ప్రారంభించారు. అలాగే సిమ్తోఖా జొంగ్ వద్ద భూటాన్‌లో రూపే పే కార్డును మోదీ ప్రారంభించారు. మరోవైపు మాంగ్దేచు జలవిద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, ఐదు దశాబ్దాల భారత-భూటాన్ జలవిద్యుత్ సహకారాన్ని గుర్తుచేసే స్టాంపులను కూడా విడుదలచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌తో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థింపూ, భూటాన్
Published date : 19 Aug 2019 05:26PM

Photo Stories