భూమి అవతల మరో గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్?
Sakshi Education
మానవ అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా భూమి అవతల మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది.
పర్సవరన్స్ రోవర్ గురించి...
మార్స్ 2020 మిషన్ సంబంధించి సమగ్ర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమి అవతల మరో గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్?
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఇన్‌జెన్యుటీ
ఎక్కడ : మార్స్
ఎందుకు : మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు...
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మార్స్‌పైకి పంపిన ‘‘ఇన్‌జెన్యుటీ’’ అనే మినీ హెలికాప్టర్... సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ ఏప్రిల్ 19న గగనయానం చేసింది. నాసా.. పర్సవరెన్స్ రోవర్‌తో కలిపి ఇన్‌జెన్యుటీని మార్స్‌పైకి పంపింది. కేవలం 1.8 కిలోల బరువున్న ఈ మినీ హెలికాప్టర్.. పది అడుగుల ఎత్తు మేర గాల్లోకి లేచి, 39 సెకన్ల పాటు ప్రయాణించింది. ఈ సందర్భంగా తొలి ఫొటో కూడా తీసింది. గాల్లోకి ఎగురుతుండగా.. కింద పడిన తన నీడను చిత్రీకరించింది.
ఇన్‌జెన్యుటీ విశేషాలు...
ఇన్‌జెన్యుటీ విశేషాలు...
- నాసా.. పర్సవరెన్స్ రోవర్‌తో కలిపి ఇన్‌జెన్యుటీని మార్స్‌పైకి పంపింది.
- మార్స్‌పై అత్యంత పలుచగా ఉండే వాతావరణంలో హెలికాప్టర్ ఎగరగలదా, భవిష్యత్తులో అక్కడి గాల్లో తిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఏమేం అవసరం అన్న అంశాలపై ఇన్‌జెన్యుటీ పరిశోధనలు చేయనుంది.
- ఇన్‌జెన్యుటీ గాల్లోకి ఎగిరి, చక్కర్లు కొట్టడాన్ని పర్సవరెన్స్ రోవర్ వీడియో తీసి.. భూమికి చేరవేసింది.
- మానవ చరిత్రలో తొలిసారిగా విమాన ప్రయాణాన్ని సాకారం చేసిన రైట్ బ్రదర్స్ కృషిని గుర్తు చేసుకుంటూ.. ఇన్‌జెన్యుటీ తొలి ప్రయాణానికి ‘రైట్ బ్రదర్స్ మూమెంట్’గా పేరుపెట్టారు.
పర్సవరన్స్ రోవర్ గురించి...
- నాసా ప్రయోగించిన అత్యాధునిక రోవర్ ‘పర్సవరన్స్’ 2021, ఫిబ్రవరి 18న అరుణ గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది.
- మార్స్ 2020 మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి 2020, జూలై 30న అట్లాస్–5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న ‘పెర్‌సెవరెన్స్’ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది.
- కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఇన్‌జెన్యుటీ అనే మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు.
- ఈ రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది.
- పర్సవరన్స్ రోవర్ 203 రోజుల పాటు, 47.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సంక్లిష్ట జెజెరొ బిలం వద్ద అరుణ గ్రహంపై అడుగిడింది.
మార్స్ 2020 మిషన్ సంబంధించి సమగ్ర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమి అవతల మరో గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్?
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఇన్‌జెన్యుటీ
ఎక్కడ : మార్స్
ఎందుకు : మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు...
Published date : 20 Apr 2021 06:19PM