భోపాల్, జోధ్‌పూర్‌లు మహిళలకు సురక్షితం కాదు
Sakshi Education
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం, మద్యం, డ్రగ్స్ వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. భోపాల్, గ్వాలియర్, జోధ్‌పూర్ నగరాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్‌లు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
Published date : 02 Dec 2019 05:48PM