Skip to main content

భారత్‌తో వాణిజ్యంలో అమెరికాకు అగ్రస్థానం

భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
Current Affairsకేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం... 2018-19లో అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019-20లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నా.. అమెరికా-భారత్ మధ్య 68 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో చైనాతో వాణిజ్యం 64.96 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018-19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనాతో 53.56 బిలియన్ డాలర్ల లోటు ఉంది.
Published date : 24 Feb 2020 06:04PM

Photo Stories