Skip to main content

భారత్‌తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే: ఇమ్రాన్‌ ఖాన్‌

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ <strong>ఎకనామిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఈసీసీ)</strong> చేసిన సిఫారసుల అమలును వాయిదావేశారు.
Current Affairs
కేబినెట్‌ సహచరులతో చర్చించాక ఇమ్రాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్‌ పత్రిక తెలిపింది. పాక్‌ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్‌ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది.

పాకిస్తాన్‌...
రాజధాని: ఇస్లామాబాద్‌; కరెన్సీ: పాకిస్తానీ రూపి
పాకిస్తాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఆరీఫ్‌ అల్వీ
పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: ఇమ్రాన్‌ ఖాన్‌
Published date : 05 Apr 2021 05:58PM

Photo Stories