Skip to main content

భారత్‌లో తొలి కోవిడ్ 19 మరణం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) భారత్‌లో తొలి మరణాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Current Affairsకర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ(76) కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ మార్చి 11న మరణించారు. ఈ విషయాన్ని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు మార్చి 12న వెల్లడించారు. 2020, జనవరి చివరి వారంలో సౌదీ అరేబియాకు వెళ్లిన సిద్ధఖీ ఫిబ్రవరి 29న తిరిగి వచ్చారు.

కేసుల సంఖ్య 74
కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. మరో 13 తాజా కేసులు వెలుగులోకి రావడంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 74కి చేరుకుంది. ఈ పరిణామాలతో భారత్ తనంతట తానుగా నిర్బంధంలోకి వెళ్లిపోయే దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దులన్నీ మూసి వేసి రాకపోకలపై నిషేధం విధించింది.

టీకా కనుగొనేందుకు రెండేళ్లు
కోవిడ్‌కి టీకా కనుగొనేందుకు భారత్‌కు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎంత యుద్ధ ప్రాతిపదికన కృషి చేసినా.. 18 నెలల్లోపు వ్యాక్సిన్‌ను కనుగొనడం అసాధ్యమన్నారు.
Published date : 13 Mar 2020 05:32PM

Photo Stories